తెహెల్కాపై హోంశాఖ దర్యాప్తు: ప్రమోద్
న్యూఢిల్లీ: తెహెల్కా పోర్టల్ సెక్స్ వర్కర్లను ఉపయోగించడంపై హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ లోక్‌సభలో చెప్పారు. తెహెల్కా కుంభకోణం గురువారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. చట్టవ్యతిరేకంగా గానీ, అనైతికంగా గానీ సమాచారం సేకరించడం సరి కాదని ఆయన అన్నారు. సైనికాధికారులు గానీ, జర్నలిస్టులు గానీ చట్టానికి అతీతులు కారని ఆయన అన్నారు.
తన ఆధీనంలో వున్న టేప్‌లలోని సమాచారం వెల్లడి కావడంపై వెంకటస్వామి కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రక్షణ కుంభకోణాల విచారణలో రహస్యం పాటించాలని ప్రభుత్వం వెంకటస్వామి కమిషన్‌కు సూచించింది.
తెహెల్కా ఉదంతంపై రాజ్యసభలోనూ వాగ్వివాదం చెలరేగింది. తెహల్కా సెక్స్ వర్కర్లను ఉపయోగించడంపై చర్చకు సమతా పార్టీ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీనికి కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరాల మధ్యనే తీర్మానంపై చర్చకు రాజ్యసభ చైర్మన్ కృష్ణకాంత్ అనుమతి ఇచ్చారు.












Click it and Unblock the Notifications