క్యాబినెట్‌లో మార్పులకు వాజ్‌పేయికసరత్తు

న్యూఢిల్లీః రెండు మూడు రోజుల్లో కేంద్ర క్యాబినెట్‌ లో భారీ మార్పులు చేయాలని ప్రధాని వాజ్‌పేయి యోచిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న రాష్ట్రపతికె.ఆర్‌. నారాయణన్‌ కోలుకుంటే ఆదివారం నాడు క్యాబినెట్‌ ను పునర్వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి. లేని పక్షంలో ప్రధాని ఈ నెల 19న ఐక్యరాజ్యసమితి సదస్సుకు వెళ్ళే ముందువిస్తరణ జరగవచ్చు.

పిఎంకె, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు తిరిగి ఎన్డీఏలో చేరిన దరిమిలా జరుగుతున్న ఈ క్యాబినెట్‌విస్తరణలో పి.ఎం.కె. కు మమతకు స్థానం కల్పించే అవకాశాలున్నాయి. అదే విధంగా తెహల్కా మచ్చపడి రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన జార్జి ఫెర్నాండెజ్‌ ను కూడా తిరిగి మంత్రిగా తీసుకొనే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

యు.పి. ఎన్నికలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న వాజ్‌పేయి కొందరు యు.పి. నేతలకు క్యాబినెట్‌ లో స్థానం కల్పించాలని యోచిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వున్న వెంకయ్య నాయుడికి పార్టీలో కీలక పదవిఅప్పగించాలన్నది ప్రధాని అభిమతం. నిస్తేజంగా వున్న ఉత్తరప్రదేశ్‌ బిజెపికి కొత్తరూపం ఇచ్చే బాధ్యతను ప్రధాని వెంకయ్య నాయుడికిఅప్పగించే అవకాశాలున్నాయి. వెంకయ్య నాయుడును మంత్రిగా తప్పించి పార్టీ పదవిఅప్పగించే కంటే మంత్రిగా కొనసాగిస్తూనే ఆయనసేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనేది కూడా మరో ఆలోచన. వెంకయ్య నాయుడికి పార్టీలో కీలక పదవి ఇస్తే పార్టీ అధ్యక్షుడు జానా కృష్ణమూర్తి అలిగే అవకాశం వున్న దృష్ట్యా మధ్యే మార్గాన్ని అనుసరించాలని వాజ్‌పేయి భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+