హార్దిక్ పాండ్యా పంట పండినట్టే.. !!

వచ్చే ఏడాది ఐపీఎల్ లో నూతన మార్పులు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ సహా మరికొన్ని జట్లల్లో నాయకత్వ మార్పులు చోటు చేసుకోవచ్చు. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్.. ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు జట్లు కూడా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్నాయి. ఈ మేరకు ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యం మధ్య ఇప్పటికే కొన్ని రౌండ్ల కీలక చర్చలు సైతం జరిగినట్లు తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించట్లేదనే విషయం తెలిసిందే. అతని కెప్టెన్సీలో ఆ జట్టు కనీస విజయాలను అందుకోలేకపోయింది. అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్ లో ఏకంగా తొమ్మిదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా రెండు సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. దీంతో హార్దిక్ సారథ్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టులో హార్దిక్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

KKR and RR Reportedly Negotiations with MI for Hardik Pandya Trade for Next IPL Possible Transfer

వచ్చే సీజన్ నాటికి జట్టులో ఉండబోనని కూడా హార్దిక్ పాండ్యా ఇదివరకే మేనేజ్మెంట్ కు తెలియజేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో అతన్ని తీసుకోవడానికి కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ జట్లు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ హార్దిక్ పాండ్యా కోల్‌కతా నైట్ రైడర్స్ లో చేరితే.. కెప్టెన్సీ బాధ్యతలు లభించవచ్చు. కేప్టెన్ అజింక్య రహానే విఫలం కావడంతో అతడిని విడుదల చేసే ఆలోచనలో కేకేఆర్ యాజమాన్యం ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అజింక్య రహానేనె విడుదల చేస్తే ఖాళీ అయ్యే కేప్టెన్సీ స్థానం కోసం కేకేఆర్ యాజమాన్యం ముంబై ఇండియన్స్ అగ్రనాయకత్వాన్ని సంప్రదించిందని, హార్దిక్ పాండ్యా బదిలీ అంశంపై చర్చించిందని చెబుతున్నారు. ముంబై ఇండియన్స్‌ను సంప్రదించేందుకు కేకేఆర్ యాజమాన్యం గత సీజన్ ముగింపులోనే ప్రయత్నించినప్పటికీ.. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం కారణంగా అప్పట్లో ఈ చర్చలు ముందుకు సాగలేదు.

ప్రస్తుతం ఈ బదిలీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ సైతం ఆసక్తి చూపినప్పటికీ.. తాజా చర్చల నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా అద్భుతమైన విజయాల ట్రాక్ రికార్డు ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు కెప్టెన్‌గా వ్యవహరించిన 61 మ్యాచ్‌లలో 36 విజయాలు సాధించగా, 25 మ్యాచ్‌ల్లో మాత్రమే జట్టు ఓటమి చవిచూసింది.

గుజరాత్ టైటాన్స్ జట్టుకు మొదటి సీజన్ 2022 లోనే ట్రోఫీని అందించిన హార్దిక్, మరుసటి ఏడాది ఆ జట్టును రన్నరప్‌గా నిలబెట్టాడు. ఈ రికార్డే కేకేఆర్ యాజమాన్యాన్ని ఆకర్షిస్తోంది. ఈ ఐపీఎల్ లో హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. ఆడిన 10 మ్యాచ్‌లలో 206 పరుగులు చేశాడు. ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేకపోయాడు. బౌలింగ్‌లోనూ విఫలమే. 11.43 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకుని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+