8 ఏళ్ల తర్వాత కనిపించిన ఆడపులి! 'రాజకుమారి' ఎంట్రీ..

అడవిలో ఒక అద్భుతం జరిగింది. గత ఎనిమిదేళ్లుగా ఒక్క ఆడపులి జాడ కూడా లేక వెలవెలబోయిన ఒక ప్రముఖ టైగర్ రిజర్వ్‌లోకి.. అకస్మాత్తుగా ఒక మహారాణి అడుగుపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న 'ఆల్ ఇండియా టైగర్ సెన్సస్ 2026' (పులుల గణన) లో ఈ విషయం వెలుగుచూసింది. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన ఈ ఆడపులి దృశ్యాలు వన్యప్రాణి ప్రేమికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని చారిత్రాత్మక ఉదంతి-సితానది టైగర్ రిజర్వ్‌లో గత ఎనిమిదేళ్లుగా ఆడపులి ఉనికి లేకుండా పోయింది. అయితే జాతీయ పులుల గణనలో భాగంగా అడవిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాప్ కెమెరాల్లో ఇటీవల ఒక ఆడపులి ఫోటోలు, వీడియోలు నిరంతరాయంగా రికార్డవుతున్నాయి. ఈ చిత్రాలను వైరిఫికేషన్ కోసం 'నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ' (NTCA) కి పంపగా, గతంలో ఈ పులికి సంబంధించిన ఎలాంటి రికార్డులూ లేవని తేలింది. అంటే, దేశంలోని పులుల లెక్కల్లోకి ఇది సరికొత్తగా చేరిన సరికొత్త రికార్డు అన్నమాట.

Rare Tigress Spotted in Udanti Sitanadi Tiger Reserve After 8 Years Added to National Tiger Census 2026

ఒంటరిగా వెళ్ళిపోయిన మగపులి.. ఇప్పుడు ఆమె కోసం?

ఈ పరిణామంపై ఉదంతి-సితానది టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ వరుణ్ జైన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "గత ఏడాది అంటే.. 2025 ఏప్రిల్‌లో ఇక్కడికి ఒక మగపులి వచ్చింది. దాదాపు 6 నుంచి 8 నెలల పాటు ఇక్కడి అడవుల్లో తిరిగింది. కానీ ఆ సమయంలో ఇక్కడ దానికి జోడీగా ఆడపులి లేకపోవడంతో అది ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఆడపులి ఇక్కడే తన సొంత సామ్రాజ్యాన్ని (Territory) ఏర్పరచుకుంటున్నట్లు కనిపిస్తోంది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పులుల సంరక్షణ కోసం మహారాష్ట్ర నుంచి ఒడిశా వరకు యాంటీ పోచింగ్ (వేట నిరోధక) ఆపరేషన్స్ రన్ చేస్తున్నామని, అడవిలో సోలార్ పంపులు, జంతువుల కోసం నీటి వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు.

తడోబా పులి.. కళ్లు చెదిరే రాజసం. చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే!
తడోబా పులి.. కళ్లు చెదిరే రాజసం. చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే!

ఎకో టూరిజం.. సరికొత్త ఆకర్షణలు

ప్రస్తుతానికి ఈ రిజర్వ్‌లో ఒకట్రెండు పులులు మాత్రమే అందుబాటులో ఉన్నందున, పర్యాటకుల కోసం జిప్సీ సఫారీలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ పులులతో పాటు అరుదైన ఎగిరే ఉడుతలు (Flying Squirrels), రంగుల ఉడుతలు (Rainbow Squirrels), హిమాలయాలు, పశ్చిమ కనుమలలో మాత్రమే కనిపించే 'మలబార్-బిల్డ్ హార్న్‌బిల్' పక్షులు కూడా ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని బేస్ చేసుకుని బర్డ్ వాచింగ్, ట్రెకింగ్ ప్రోగ్రామ్‌లు, హోమ్‌స్టేలను నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

దేశంలో తొలిసారిగా మంచు చిరుతల కౌంటింగ్! భారీగా పెరిగిన పులులు
దేశంలో తొలిసారిగా మంచు చిరుతల కౌంటింగ్! భారీగా పెరిగిన పులులు

ఎన్టీసీఏ (NTCA) నివేదికల ప్రకారం.. దేశంలో పులుల సంరక్షణ చర్యల వల్ల భారతదేశంలో పులుల జనాభా 2018లో 2967 ఉండగా, అది 2022 నాటికి 3682కి పెరిగింది. ప్రస్తుతం దేశ భౌగోళిక వైశాల్యంలో దాదాపు 2.5% విస్తీర్ణంలో 58 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో ఉదంతి అడవుల్లో ఆడపులి రాక... ఈ ప్రాంతంలో పులుల వంశాభివృద్ధికి, అడవుల పునరుజ్జీవనానికి ఒక శుభసూచికంగా అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+