మెట్రో షాక్.. దారి లేక లారీలెక్కిన టెక్కీలు.. వీడియోలు వైరల్!

ఇండియా సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో మంగళవారం సాయంత్రం భారీ గందరగోళం నెలకొంది. బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్‌లో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్‌లో ఈ సంఘటన జరగడంతో పలు మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులు భారీ క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. ఇళ్లకు చేరుకోవడానికి వేరే దారి లేక టెక్కీలు, సాధారణ ప్రయాణీకులు రోడ్లపై వెళ్తున్న లారీలు, ట్రక్కులను ఆశ్రయించి ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

రోడ్లపై ట్రాఫిక్ జామ్.. స్తంభించిన రవాణా వ్యవస్థ
మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తడంతో రైళ్లలోని ప్రయాణీకులను కిందకు దిగిపోవాలని అధికారులు కోరారు. దీనితో ఒక్కసారిగా వేలాది మంది ప్రయాణీకులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల కోసం రోడ్లపైకి రావడతో బెంగళూరు వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మెట్రో నిలిచిపోవడంతో క్యాబ్‌లు, ఆటోలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే అవి కూడా దొరక్కపోవడం లేదా ఆటో డ్రైవర్లు రావడానికి నిరాకరించడంతో ప్రయాణీకుల కష్టాలు వర్ణనాతీతంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే విసిగిపోయిన ఐటీ నిపుణులు, ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరడానికి లారీల వెనుక భాగంలోకి ఎక్కి ప్రయాణించాల్సి వచ్చింది.

Bengaluru Metro Snag Techies Ride on Trucks After Purple Line Disruption Videos Goes Viral

ఫస్ట్ వరల్డ్ టాలెంట్.. ధర్డ్ వరల్డ్ గవర్నెన్స్
బెంగళూరు నగరంలో తలెత్తిన ఈ దుస్థితిపై ప్రతిపక్ష నేతలు, పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. "ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్ (అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రతిభ.. మూడో ప్రపంచ దేశాల స్థాయి పాలన). ఇదే బెంగళూరు ప్రస్తుత కథ" అంటూ ఆయన ట్వీట్ చేశారు. బెంగళూరులో మెట్రో అంతరాయాలు ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన మండిపడ్డారు. కష్టపడి పని చేస్తూ, ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లిస్తున్న ఐటీ నిపుణులు ఇళ్లకు వెళ్లడానికి ట్రక్కులను ఆశ్రయించాల్సి రావడం ఈ విరిగిపోయిన వ్యవస్థకు నిదర్శనమని ఆయన విమర్శించారు.

బుధవారం ఉదయానికి పునరుద్ధరణ
మెట్రో అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. మంగళవారి సాయంత్రం దాదాపు 6.30 గంటల ప్రాంతంలో పర్పుల్ లైన్‌లోని కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఓ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. వైట్‌ఫీల్డ్ ఐటీ కారిడార్‌ను నగరంలోని కీలక ప్రాంతాలతో అనుసంధానించే ఈ లైన్లో అంతరాయం కలగడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఆ తర్వాత ఎంజీ రోడ్ నుంచి వైట్‌ఫీల్డ్ మధ్య పాక్షికంగా సేవలను పునరుద్ధరించినప్పటీ రద్దీని నియంత్రించడం సాధ్యం కాలేదు. మెట్రో సిబ్బంది రాత్రంతా శ్రమించి మరమ్మతులు పూర్తి చేయడంతో, బుధవారం ఉదయం 5 గంటల నుంచి పర్పుల్ లైన్‌లో మెట్రో సేవలు యథావిధిగా ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+