ఇంతవరకూ చేయని డెడ్లీ క్యారెక్టర్ లో సూపర్ స్టార్: టైటిల్ రివీల్.. !!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న తదుపరి చిత్రం తలైవర్ 173 పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి టైటిల్ నిర్ధారించారు. ఇది ఆయన నటిస్తోన్న 173వ సినిమా. కొద్దిసేపటి కిందటే ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తోన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సమర్పిస్తోంది.

ధర్మన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ది డెడ్లీ డాక్టర్ అనేది దీని ట్యాగ్‌లైన్‌. రజినీకాంత్ డాక్టర్ క్యారెక్టర్ లో నటించిన సినిమాలు పెద్దగా లేవు. ఈ సినిమాకు దర్శకుడు.. అశ్వథ్ మారిముత్తు. గతంలో ఓ మై కడవులే,డ్రాగన్ వంటి సూపర్ హిట్ సినిమాలను తీశాడు. రజినీకాంత్ సరసన సీనియర్ నటి సిమ్రాన్ కథానాయికగా నటిస్తోంది. 2019లో వచ్చిన పేట తర్వాత ఆమె రజినీతో కలిసి నటించడం ఇదే మొదటిసారి.

Rajinikanth 173th Movie Title as Dharman by Ashwath Marimuthu Produced Under Kamal Haasan RKFI

గతంలో కమల్ హాసన్ సరసన పంచతంత్రం, పమ్మల్ కె సంబంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో మెరిశారు సిమ్రాన్. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అయినట్టయింది. సిమ్రాన్‌తో పాటు రాశీ ఖన్నా కూడా నటిస్తోన్నారు. ఓ కీలక పాత్రను పోషిస్తోన్నారు. ప్రముఖ నటడు, దర్శకుడు మిస్కిన్ కూడా ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన వివరాలనేవీ కూడా చిత్ర యూనిట్ నుండి ఇంకా వెలువడాల్సి ఉంది.

దర్శకుడు అశ్వథ్ మారిముత్తు గత చిత్రం డ్రాగన్ లో నటించాడు మిస్కిన్. ఈ చిత్రం 25వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైలిష్ డాక్టర్ సూట్‌లో దర్శనం ఇచ్చారు. ఆయన చేతిలో ఓ సర్జికల్ బ్లేడ్ కనిపించింది. ఆపరేషన్ థియేటర్ లో ఎవరి పైనో దాడి చేస్తున్న స్టిల్ అది. అభిమానుల్లో అప్పుడే భారీ అంచనాలను పెంచింది.

యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలను స్వీకరించారు. ప్రముఖ ఫైట్ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్ నేతృత్వంలో ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కనుండటం మరింత ఉత్కంఠను రేపుతోంది. అంతకుముందు ఈ సినిమా కథ అనేక మలుపులు తిరిగింది. మొదట సీనియర్ డైరెక్టర్ సుందర్ సీ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాల్సి ఉన్నా ఆ తర్వాత తప్పుకొన్నారు. ఆ తర్వాత డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి పేరు ప్రధానంగా వినిపించింది. చివరికి దర్శకత్వ బాధ్యతలు అశ్వథ్ మారిముత్తు చేతుల్లోకి చేరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+