మార్చేస్తాం, డెడ్ లైన్ - ఎమ్మెల్యేలకు రేవంత్ హెచ్చరిక..!!

సీఎం రేవంత్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు. ఈరోజు(బుధవారం) కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. పార్టీ నేతల కు కీలక దిశా నిర్దేశం చేసారు. ప్రత్యర్థి పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అప్రమత్తం గా ఉండాలని చెప్పినా.. నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్ లో కఠిన నిర్ణయాలు తప్పవని రేవంత్ హెచ్చరించారు.

సీఎం రేవంత్ SIR అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. SIRతో బీజేపీ కుట్ర చేస్తోందని.. అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉంటూ మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తనకి ఒక నియోజకవర్గం కేటాయిస్తే వెళ్లి పనిచేస్తానని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు తీరు మారితే ఒకే అని.. వారం రోజుల్లో తీరు మారకపోతే ఎమ్మెల్యేల స్థానంలో యాక్టివ్‌గా ఉన్న మరోవ్యక్తిని ఇన్‌ఛార్జిగా నియమిస్తామని సీఎం స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయని వాళ్లు పార్టీకి అవసరం లేదని తేల్చిచెప్పారు. SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలో ఏ పదవిలో ఉన్నా SIR విషయంలో గ్రౌండ్ లెవల్‌కు వెళ్లి పనిచేయాల్సిందే అని అన్నారు. 'ఎవరెవరు పని చేయడం లేదో నా దగ్గర రిపోర్ట్ ఉంది. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే మీటింగ్‌లో పేర్లు చెప్పాల్సి వస్తుంది. పేర్లు చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్ద'ని హెచ్చరించారు.

ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్..!!
ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్..!!
cm-revanth-wanred-mlas-over-sir-electoral-rolls-any-negligence-could-have-serious-political-consequ

వారం రోజులే గడువు

అదే విధంగా ఇన్‌ఛార్జి మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని.. పనిచేయకపోతే ఇన్‌ఛార్జి మంత్రులను కూడా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హెచ్చరించారు. జూమ్ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. SIR ప్రక్రియలో నిర్లక్షంపై ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. SIR విషయంలో చాలా మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా తీరు మారాలని సూచించారు. ప్రతి ఓటునూ కాపాడుకోవాలని ఆదేశించారు. లౌకికవాదుల ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోందన్నారు. గద్వాల, మల్కాజిగిరి, భువనగిరి, నిజామాబాద్‌లో వీక్‌గా ఉన్నామని చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం సబబు కాదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఓటు హక్కు రాజకీయాల కోసం మాత్రమే కాదని మీనాకి నటరాజన్ అన్నారు. ఓటు హక్కును కాపాడవలసిన బాధ్యత అందరిది అని మీనాకి నటరాజన్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+