విజయ్ కోసం త్రిష స్పెషల్ పోస్ట్.. ఆ క్యాప్షన్ అసలు అర్ధం అదేనా..?
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ జూన్ 23వ తేదీన తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి వచ్చిన బర్త్ డే కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆయనకు అత్యంత సన్నిహితురాలైన హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే విజయ్ - త్రిష రిలేషన్ బ్రేక్ అయిందని.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేశారనే విషయం బయటకు రావడం మరో చర్చకు దారితీసింది. అయితే వీటన్నింటికీ ఒకే ఒక్క ఫొటోతో చెక్ పెట్టేశారు త్రిష. ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేశారు. 'ప్రతిదాన్నీ సార్థకం చేసే ఆ వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు. హ్యాపీ బర్త్ డే చెబుతూ రెడ్ హార్ట్ ఎమోజీని జోడించడంతో పాటుగా 00.00 అని రాసుకొచ్చారు. ఈ ఫోటోలో విజయ్ నవ్వుతూ ఉండగా.. త్రిష అతన్నే చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. విజయ్ ఎదురుగా ఐదు బర్త్‌డే కేక్స్ కూడా ఉన్నాయి.

కాగా ఆ పోస్టులో క్యాప్షన్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 00:00 అంటే సరిగ్గా అర్ధరాత్రి (midnight) అని అర్థం. విజయ్ పుట్టినరోజున త్రిష పెట్టిన పోస్ట్‌లో ఈ సమయానికి కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి.
ఖచ్చితమైన సమయం: పుట్టినరోజు ప్రారంభమైన మొదటి సెకనులోనే (అర్ధరాత్రి 12 గంటలకు) అందరికంటే ముందే శుభాకాంక్షలు చెప్పడాన్ని ఇది సూచిస్తుంది.
కొత్త ప్రారంభం: అర్ధరాత్రి అనేది ఒక కొత్త రోజుకు మరియు సరికొత్తగా ఆరంభం చేయడానికి సూచిక.
ప్రత్యేక అనుబంధం: ఆ క్షణం కోసం ఎదురుచూశారని లేదా ఆ సమయానికి శుభాకాంక్షలు పంచుకోవాలనే వారి ఆరాటాన్ని ఇది చూపిస్తుంది.
రిలేషన్ రూమర్స్..
కాగా విజయ్, త్రిష గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అందుకు బలం చేకూరుస్తూ విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం విమర్శలుకు దారితీసింది. ఆ తర్వాత విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడం ముఖ్యమంత్రి అవడం జరిగిపోయాయి. కానీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత త్రిష నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలపడం.. ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం.. ఆ తర్వాత అజిత్ తల్లి చనిపోగా అక్కడికి కూడా కలిసి వెళ్లి నివాళులు అర్పించారు. దాంతో ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ఊహాగానాలు కూడా గట్టిగా వినిపించాయి.
To the person who makes it all worth it,HBD❤️🧿
— Trish (@trishtrashers) June 23, 2026
00.00✨ pic.twitter.com/2e6QcueVRP












Click it and Unblock the Notifications