AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాలు ఆ రోజే ? తాజా అప్డేట్..!
ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్ పరీక్ష (AP EAPCET 2026 Results) ఫలితాలపై తాజా అప్డేట్ వచ్చింది. ఇప్పటికే నెల రోజులుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు దీంతో లింక్ అయిన పరీక్షల ఫలితాల విడుదల వ్యవహారం చికాకు పెడుతోంది. ముందుగా ఏపీలో ఇంటర్ అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ ఫలితాలు, ఆ తర్వాత సీబీఎస్ఈ సప్లిమెంటరీ ఫలితాలు.. ఇలా ఒక దాని తర్వాత మరొకటి ఆలస్యం కావడంతో వీటి ప్రభావం ఎంసెట్ ఫలితాలపై పడింది. వీటిపై ఒక్కొక్కటిగా క్లారిటీ వస్తుండటంతో ఎంసెట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమం అవుతోంది.
ఈ ఏడాది ఎంసెట్ ఫలితాలు ఈ నెల 28న విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం సీబీఎస్ఈ పరీక్షల జవాబుపత్రాల రీవెరిఫికేషన్, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ తుది దశలో ఉంది. ఇప్పటికే ఇందులో చాలా మందికి ఫలితాలు వచ్చేశాయి. మిగిలిన వారికి కూడా ఈ రెండు రోజుల్లో ఫలితాలు ఇచ్చేస్తారు. ఈ ఏడాది మొత్తం 8 వే ల మంది సీబీఎస్ఈ విద్యార్ధులు ఎంసెట్ పరీక్షలు రాశారు. వీరిలో రీవెరిఫికేషన్, రీఎవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలు పూర్తిగా వెలువడగానే ఎంసెట్ మార్కుల్లో మార్పులు, చేర్పులు ఉంటాయి. వీటిని పూర్తి చేసి ఈ నెల 28న ఫలితాలు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

ఈ ఏడాది మొత్తం 3.29 లక్షల మంది విద్యార్ధులు ఎంసెట్ పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదల కాగానే అభ్యర్ధులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తమ లాగిన్ వివరాలు ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రింట్ అవుట్ నే కౌన్సెలింగ్ కు తీసుకెళ్లాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications