పటిష్టమైన స్థితిలో శ్రీలంక-323/5
కొలంబో: కీలకమైన మూడో క్రికెట్ మ్యాచ్‌లో శ్రీలంక తన బ్యాటింగ్ ప్రతిభతో పటిష్టమైన స్థితికి మార్గం వేసుకుంది. రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఐదువికెట్లు మాత్రమే కోల్పోయి 323 పరుగులు చేసింది. భారత బౌలర్లు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను నిలువరించలేకపోయారు. బుధవారంనాటి 13 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మైదానంలోకి దిగిన ఆటపట్టు, జయసూర్య భారత బౌలింగ్‌ను ధాటిగానే ఎదుర్కున్నారు. అయితే, శ్రీలంక కెప్టెన్ సనత్ జయసూర్య 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు.
ఆటపట్టు భారత బౌలర్లను చెండాడుతూసెంచరీ చేశాడు. ఆటపట్టు 108 పరుగులు చేసి అవుటయ్యాడు. సంగరక్క 47 పరుగులు చేశాడు. జయవర్ధనే 95 పరుగులతో, తిలకరత్నే పరుగులేమీ చేయకుండా క్రీజ్‌లో వున్నారు. భారత బౌలర్లలో వెంకటేష్ ప్రసాద్ మూడువికెట్లు, హర్బజన్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నారు. శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీథరన్ భారత బ్యాట్స్‌మెన్‌ల పాలిటి సింహసప్నంగా మారినట్లు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను హర్బజన్ ముప్పు తిప్పలుపెట్టలేకపోయాడు.












Click it and Unblock the Notifications