సుప్రీంకోర్టులో జయకు చుక్కెదురు
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు నుంచి చుక్కెదురయింది. టాన్సీ భూకుంభకోణం,ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల్లో తనకు పడిన శిక్షను సవాల్ చేస్తూ జయలలిత మద్రాసు హైకోర్టులోపెట్టుకున్న మూడు అప్పీల్లపై విచారణపై సుప్రీంకోర్టు గురువారంస్టే ఇచ్చింది.
జయలలిత పెట్టుకున్న అప్పీల్లను విచారణను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఎస్.పి. బరూచా, జస్టిస్ వై.కె. సబర్వాల్, జస్టిస్‌అశోక్ భానులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ రాష్ట్ర సిబిసిఐడికి, జయలలితకు నోటీసులు జారీ చేసింది.
ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియమితులైన రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్‌కె.వి. వెంకటపతి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆ నోటీసులు ఇచ్చింది. మద్రాసు హైకోర్టు అనుచిత రీతిలో వ్యవహరిస్తోందని అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ అన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకువిచారణను నిలిపేయాలని సుప్రీంకోర్టు బెంచ్ మద్రాస్ హైకోర్టును ఆదేశించింది.












Click it and Unblock the Notifications