తెలంగాణాపై దేశం దృష్టి
హైదరాబాద్ : తెలంగాణా వెనుకబాటుతనంపై ప్రత్యేక శ్రద్ధచూపాలని తెలంగాణాకు చెందిన తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకువిజ్ఞప్తి చేశారు. గురువారం నాడు హైదరాబాద్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న వందలాది తెలుగుదేశం నాయకులు ఈమేరకు చంద్రబాబు నాయుడినికోరారు.
ప్రభుత్వం తెలంగాణా అభివృద్ధికోసం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలను తక్షణం అమలు చేయాలని వారుకోరారు. అలాగే, ఎత్తిపోత పధకాలు, పెండింగ్ ప్రాజెక్టులను కూడా త్వరితంగా పూర్తిచేయాలనికోరారు. ప్రత్యేక తెలంగాణా పేరుతో ప్రజలను తప్పుతోవపట్టిస్తున్న పార్టీలను ఎదుర్కొనేందుకు వెనుకబడిన తెలంగాణాను అభివృద్ధి పరచటమొక్కటే మార్గమని ఈ మూడు జిల్లాలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రితో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications