1న విస్తరణ- వెంకయ్య పదవి పదిలం?
న్యూఢిల్లీ: ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి తన మంత్రి వర్గాన్ని శనివారంనాడు పునర్వ్యస్థీకరించనున్నారు. కొత్త మంత్రులు శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడును మంత్రి వర్గం నుంచి తొలగించి, పార్టీసెక్రటరీ జనరల్‌గా నియమించవచ్చుననే ప్రచారం జరిగింది. అయితే, వెంకయ్యనాయుడుఅందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో వెంకయ్యనాయుడు మార్చే తన ఆలోచనను ప్రధానివిరమించుకున్నట్లు చెబుతున్నారు.
మంత్రి వర్గంలోకి ఇద్దరిని కొత్తవారిని తీసుకునే అవకాశాలున్నాయి. ఆరుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారనిఅంటున్నారు.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ కసరత్తు జరుగుతున్న ఈ తరుణంలో గనుల శాఖ సహాయ మంత్రి సుందర్‌లాల్ పట్వా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రధానిని కలిసి చెప్పారు.
ఈసారి భారతీయ జనతా పార్టీకే మంత్రి వర్గ విస్తరణను పరిమితం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జౌళి శాఖ సహాయ మంత్రి ధనంజయ్ కుమార్‌కు, కార్మిక శాఖ మంత్రి సత్యనారాయణ్ జతియాకు ఉద్వాసన పలికే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రి అరుణ్ శౌరికి కేబినెట్ హోదా కల్పిస్తారు. జార్ఖండ్‌కు చెందినసీనియర్ బిజెపి నాయకుడు కరియా ముండాకు మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశం వుంది.
పార్లమెంటు వర్షాకాలం సమావేశాలకు ముందు జరిగిన మంత్రి వర్గవిస్తరణలో రాష్ట్రీయ లోక్‌దళ్ నేత అజిత్ సింగ్‌కు మాత్రమే మంత్రి వర్గంలో చోటు కల్పించారు.












Click it and Unblock the Notifications