లంకేయుల జోరు - 610/6 డిక్లేర్డ్
కొలంబోః లంకేయుల జోరుతో భారత్ బేజారెత్తిపోయింది. కొలంబో స్టేడియంలో పరుగులు ఏరులాపారాయి. శ్రీలంక ఇన్నింగ్స్ లో నలుగురు సెంచరీలు చేశారు. గురువారం నాడు ఆటపట్టుసెంచరీ సాధించగా, శుక్రవారం జయవర్ధనే, తిలకరత్నే, తొలిటెస్ట్ ఆడుతున్న సమరవీర కూడాసెంచరీలు సాధించారు. ఏ దశలోనూ భారత్ బౌలర్ల శ్రీలంకను కట్టడి చేయలేకపోయారు. 376 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన శ్రీలంక 610 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
గంగూలీ ఎందరు బౌలర్లను మార్చినా శ్రీలంక పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేక పోయాడు. 139 పరుగులు చేసిన జయవర్థనే సాయిరాజ్ బహుతులే బౌలింగ్ లో ఎల్.బి. డబ్ల్యూ. గా అవుటయ్యాడు. ఆ తరువాత భారత్ కు ఒక్కవికెట్ కూడా లభించలేదు. భారత్ ముందు శ్రీలంక భారీ లక్ష్యాన్నే వుంచింది. ముత్తయ్య మురళీ ధరన్ స్పిన్ మాయాజాలాన్ని ఎదుర్కొని భారత్ బ్యాట్స్ మెన్ ఏ మాత్రం స్కోరు సాధిస్తారో వేచి చూడాలి. ఇంకా రెండు రోజుల ఆటమిగిలి వుండగా తొలిఇన్నింగ్స్ మాదిరిగానే భారత్ బ్యాట్స్ మెన్ ఆడితే ఇన్నింగ్స్ ఓటమి తప్పక పోవచ్చు.












Click it and Unblock the Notifications