వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌లోఅప్లోజిక్‌ సంచలనం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః దేశంలోని తొలి వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ సంస్థ అప్లోజిక్‌ బ్రాడ్‌బాండ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ భారీ ఎత్తున సర్వీసుల విస్తరణకు సన్నాహాలు చేస్తున్నది.ఈ సంస్థ ఇప్పటికే వైర్‌లెస్‌ బ్రాడ్‌బాండ్‌ సర్వీసుల్లో అగ్రగామిగా పేరుసంపాదించుకున్నది. 46 కార్పొరేట్‌ సంస్థలకు సర్వీసులను అందజేస్తున్నది.

కన్వర్జెన్స్‌ బిల్లు పార్లమెంట్‌ ఎదుట వున్న ప్రస్తుతం తరుణంలో, బాండ్‌విడ్త్‌ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో కార్పొరేట్లు, వివిధ సంస్థలు, వ్యక్తుల అవసరాలనువైర్‌లెస్‌ నెట్‌ వర్క్‌ ఆధారంగా తీర్చడానికి ఈ సంస్థ అవసరమైన హంగులన్నీ సమకూర్చుకున్నది. వాయిస్‌, డేటా, విడియోను తమ నెట్‌వర్క్‌ ద్వారా కన్వర్జ్‌ చేసి అనాయసంగా పంపవచ్చని అప్లోజిక్‌ తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు అమెరికా సింగపూర్‌లో కూడా కార్యాలయాలు వున్నాయి. దేశంలోనే తొలిసారిగా గత ఏడాది వైర్‌లెస్‌ గేట్‌వేను అప్లోజిక్‌ ప్రారంభించింది. సంస్థకు సొంత శాటిలైట్‌ ఎర్త్‌ స్టేషన్‌ వుంది.

లీజ్‌డ్‌ లైన్స్‌, డైల్‌అప్‌ నెట్‌వర్క్‌, ఐఎస్‌డిఎన్‌, డిఎస్‌ఎల్‌, కేబుల్‌తో పోలిస్తే వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ ఆక్సెస్‌ అనేక విధాల ఉత్కృష్టమైనదని సంస్థ ఎండి వెంకట్‌ ఎస్‌ మీనవల్లి చెప్పారు. లీజ్డ్‌ లైన్ల కంటే ఇది చౌకకూడా అని వెల్లడించారు.

మారిషస్‌, సౌదీఅరేబియా, గాంబియా, కువాయిట్‌ల్లో వైర్‌లెస్‌ కన్వర్జెన్స్‌ బాక్‌ బోన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు తమకు కాంట్రాక్టులు వచ్చినట్టుగా ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X