జపాన్‌లో ఘోర అగ్నిప్రమాదం
టోక్యోః టోక్యోలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారు. టోక్యో ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్‌లో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
అగ్ని ప్రమాదానికి పేలుడు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని అస్పత్రికి తరలించారు.విస్పోటనమే అగ్నిప్రమాదానికి కారణమని స్పష్టంగా చెప్పే ఆధారాలు ఏమీ ఇంకా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం మూడో అంతస్తులోని ఒక జూద గృహం తలుపులను సంస్థ ఉద్యోగులు తెరిచినప్పుడు ఒక్కసారిగా పేలుడు శబ్దమైనట్టుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications