విద్యావ్యవస్థ ప్రక్షాళన తధ్యంః ప్రధాని
న్యూఢిల్లీః భారతదేశంలో విద్యావిధానం లోపభూయిష్టంగా మారిందని ప్రధాని వాజ్‌పేయి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాధమిక విద్యావ్యవస్థ కష్టాల్లో చిక్కుకుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగాఎంపికైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రశ్నించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగాఎంపికైన వారికి వాజ్ పేయి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యారంగంలో మార్పులు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వాజ్‌పేయి చెప్పారు. విద్య కాషాయీకరణ ఊసెత్తనప్పటికీ మార్పు అనివార్యమంటూ చలోక్తులువిసిరారు. ప్రధాని కావడం గొప్ప విషయం కాదని, ఈ రోజుల్లో రెండేళ్ళకు ఒకరు ప్రధానిగా వస్తున్నారన్నారు. నేను కూడా మార్పుకోసం ఎదురు చూస్తున్నానని వాజ్‌పేయి నవ్వుతూ చెప్పారు. భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఆరోగ్య పరిస్థితి, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను ఒకతాటిపై నడిపించడం శక్తికిమించిన భారం కావడంతో వాజ్ పేయి ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారనే ఊహాగానాల మధ్య వాజ్‌పేయి ఛలోక్తి ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications
