కరవు ప్రాంతాల్లోఅందరికీ పనిః బాబు
కర్నూలుః కరవు ప్రాంతాల్లో పనిచేసే శక్తి వున్న వారందరికీ పని కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని, కరవు నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఆయన అన్నారు. కరవు తీవ్రతను పరిశీలించేందుకు ఆయన శుక్రవారం నాడు కర్నూలు, ప్రకాశం జిల్లాలలో పర్యటించారు. కరవు తీవ్రతతో పాటు కనీసం తాగేందుకు సైతం మంచినీళ్ళు లేకుండా పోయాయని ప్రకాశం జిల్లా చంద్రశేఖర పురం ప్రజలు ముఖ్యమంత్రికి నివేదించారు.
కన్నీరు మున్నీరవుతున్న రైతులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం వలసవెళ్ళడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయని చంద్రబాబు అన్నారు. పంచాయతీల వద్ద వున్న నిధులతోఅందరికీ పని కల్పించే పథకాలను చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. పనిచేసే వారికి 30 రూపాయల కూలితో పాటు 5 కిలోల బియ్య ఇవ్వనున్నట్లు ఆయనవివరించారు. అనంతరం కర్నూలు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రికి కరవు గాధలేవినిపించాయి. వర్షాభావ పరిస్థితులతో బీడుపట్టిన భూములు చంద్రబాబుకు దర్శనం ఇచ్చాయి. పశువులు వున్న ప్రతివారికి ఉచితంగా కొంత పశుగ్రాసం ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
అనంతపురం జిల్లాతో పాటు వివిధ జిల్లాలలో తీవ్రమైన మంచినీటి కొరత నెలకొని వున్నదని, నీరు లేని గ్రామాలకు టాంకర్ల ద్వారా నీరందించాలని ఆయన అధికారులనుకోరారు. మంచినీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చంద్రబాబు చెప్పారు.
- బాబు నిర్వాకంపై కాంగ్రెస్, లెఫ్ట్ ధ్వజం












Click it and Unblock the Notifications