1500మంది ఉద్యోగులకువిఆర్‌ఎస్
హైదరాబాద్‌ః మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సుమారు 1500 మంది ఉద్యోగులకుస్వచ్ఛంద పదవీ విరమణ పధకం అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(ఎపిఐడిసి) స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ లలో ఈ విఆర్‌ఎస్ ను అమలు చేయాలని సోమవారం సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం తీర్మానించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్న తరుణంలో సుమారు 1500 మందికివిఆర్‌ఎస్ ఇవ్వాలనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నెలకొన్ని తీవ్ర కరవు పరిస్థితిని క్యాబినెట్ సమీక్షించింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దరిమిలా రైతులకు పంటలు వేసేవిషయంలో తగు సూచనలు చేసి మరింత నష్టపోకుండా చూడాలని నిర్ణయించారు.
ప్రభుత్వ అమలు చేస్తున్న వివిధ పథకాల పనితీరును కూడా క్యాబినెట్ సమీక్షించింది. కరవు సహాయ చర్యలను ఏ విధంగా చేపట్టాలి, కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేఅంశాలపై కూడా క్యాబినెట్ చర్చించింది.












Click it and Unblock the Notifications