దావూద్ కు పాక్ లో రాచమర్యాదలు!
ఇస్లామాబాద్‌ః మాఫియా డాన్, ముంబయ్ లోపేలుళ్ళు సృష్టించి వందలాది మంది మరణానికికారకుడైన దావూద్ ఇబ్రహీం ముఠా పాకిస్తాన్ లో వున్నట్లు ఇస్లామాబాద్ కు చెందిన ఓ పత్రిక వెల్లడించింది. దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ప్రభుత్వం రాజలాంఛనాలు చేస్తున్నదని ఆ పత్రిక బట్టబయలు చేసింది.
పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్‌పర్వేజ్ ఇటీవల ఆగ్రా సదస్సులో పాల్గొన్న సందర్భంగా భారత హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో వున్నవిషయాన్ని ప్రస్తావించారు.
ఆ విషయాన్ని మాట్లాడేందుకే నిరాకరించిన ముషారఫ్ ఆ తరువాత దావూద్ పాకిస్తాన్ లో లేనే లేడని బుకాయించారు. దావూద్ ఇబ్రహీం తన అనుచరులతో 6,000 చదరవు ఆడుగుల అత్యంత అధునాతన భవనంలో సకల సౌకర్యాలతో నివసిస్తున్నాడని న్యూస్ లైన్ అనే పత్రిక వెల్లడించింది. కరాచీ లోని దావూద్ ఇబ్రహీం నివాసంలోస్విమ్మంగ్ పూల్, టెన్నిస్ కోర్టు తో పాటు పలు అధునాతన సౌకర్యాలు వున్నాయని ఆ పత్రిక ఫోటోలతో సహా ప్రచురించింది. ఆ ఇంటి నుంచే దావూద్ చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిరాటంగా సాగిస్తున్నాడని కూడా ఆ పత్రిక రాసింది. దావూద్ తో పాటు ఛోటా షకీల్, టైగెర్ మెమెన్ వారి కుటుంబాలు కరాచీలో అధికార మర్యాదల మధ్య జీవిస్తున్నారని ఆ పత్రికవివరించింది.
ఎన్నో విధాలుగా తమకు సహాయపడుతున్న దావూద్ ఇబ్రహీం కు పాకిస్తాన్ ప్రభుత్వం రాచమర్యాదలు చేస్తున్నదని పత్రిక తెలిపింది. ఆ పత్రిక ఫోటోలతో సహా ప్రకటించినవిషయంపై ముషారఫ్ ఏమంటారోచూడాలి!












Click it and Unblock the Notifications