కరవుపై వెల్లువెత్తుతున్న ఆందోళన
హైదరాబాద్‌ః కరవు సహాయ చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అయిందంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నది. వర్షాలు లేక, పంటలు ఎండిపోయి, పశువులకు మేతలేక, కనీసం తాగేందుకు నీళ్ళు లేక రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే చంద్రబాబు నాయుడు సమీక్షలతో కాలం వెళ్ళదీస్తున్నారని వివిధ పార్టీలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో కరవు పై జరిగిన నిరసన పర్వాల వివరాలుః
విశాఖపట్నంలో.....
విశాఖజిల్లా ప్రజలు కరవు తీవ్రతతో అల్లాడిపోతున్న దృష్ట్యా మండలానికి కోటి రూపాయల చొప్పున కరవు సాయంఅందించాల్సిందిగా విశాఖ జిల్లాపరిషత్ సమావేశం సోమవారం తీర్మానించింది. కరవు సహాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వంవిఫలం అయిందంటూ విశాఖలో సిపిఐ ధర్నా నిర్వహించింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీఅయిన తెలుగుదేశం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకురావాలని వారుకోరారు.
తిరుపతిలో........
కరవు సహాయచర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చతికిల పడిందని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భారీ ఉద్యమం తప్పదంటూ సిపిఐ తిరుపతిలో ప్రదర్శన నిర్వహించింది. చిత్తూరు జిల్లా ఏడారిగా మారుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అని ఉద్యమకారులు ధ్వజమెత్తారు.
అనంతపురంలో బిజెపి ధర్నాః
కరవు సహాయ చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంవిఫలం అయిందంటూ బిజెపి అనంతపురంలో ధర్నా నిర్వహించింది. రైతులకు పశుగ్రాసంఅందించాలని డిమాండ్ చేసింది. అనంతపురంలో కనీసం మంచినీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని బిజెపి నేతలువిమర్శించారు. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమైన బిజెపి కరవుపై నిరసనకు దిగడంవిశేషం.
కరీంనగర్ లో అవగాహన సదస్సుః
కరవు పరిస్థితుల్లో రైతులు అనుసరించాల్సిన పద్ధతులనువివరించేందుకు సోమవారం కరీంనగర్ లో ఉత్తర తెలంగాణా వ్యవసాయ శాస్త్రజ్ఞుల సమావేశం జరిగింది. కరవు సమయంలో ఏ పంటలు వేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవిషయంపై శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications