ఫిజీలో ఓడి గెలిచిన మహేంద్రచౌదరి
సువాః ఫిజీ మాజీ ప్రధాని, భారత సంతతికి చెందిన మహేంద్ర చౌదరి కౌటిల్యం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగినన్ని స్థానాలు రాకపోవడంతో ఫిజీ ప్రధాని కావాలనుకున్న మహేంద్ర చౌదరి ఆశలు అడియాసలయ్యాయి. బొటాబొటి మెజారిటీ సాధించిన లైసేనియా కురాసే సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుక్షణం నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.
ఫిజీ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ఎన్నికల్లో 8 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీకి దామాషా ప్రకారం మంత్రి పదవులు ఇస్తారు. రాజ్యాంగం ప్రకారం లభించిన ఈ అవకాశాన్ని చౌదరి చక్కగా
ఉపయోగించుకున్నారు. పార్లమెంటులో మహేంద్ర చౌదరి పార్టీ 24 స్థానాలు గెలుచుకున్నది. ఫిజీ రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ లో మహేంద్ర చౌదరి పార్టీకిపెద్ద సంఖ్యలోనే పదువులు లభిస్తాయి. ప్రతిపక్ష సభ్యులు క్యాబినెట్ లో వుంటే మళ్ళీసంక్షోభం సృష్టిస్తారని నూతన ప్రధాని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడంతో భారీగా రిగ్గింగ్ జరిగిందంటూ గగ్గోలుపెట్టిన మహేంద్ర చౌదరి ఇప్పుడు ఫిజీ రాజ్యాంగం ప్రకారం లభించన క్యాబినెట్ స్థానాలనుఅంగీకరించారు. మహేంద్ర చౌదరి ఏ ఎత్తుగడ పన్ని కొంపముంచుతాడో అని ఫిజీ ప్రధాని తలబాదుకుంటున్నాడు గత ఏడాది మేలో జార్జిస్పీట్ సారధ్యంలో జరిగిన తిరుగుబాటులో మహేంద్ర చౌదరి ప్రధాని పదవి కోల్పోయినవిషయం విదితమే. ఆ నాటి నుంచి తిరిగి ప్రధానిపీఠం ఎక్కేందుకు నానా ప్రయాసలు పడిన చౌదరికి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఫిజీ రాజ్యాంగం ఆయనకు ఇప్పుడో చక్కని అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మహేంద్ర చౌదరి ఎలా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications