కృషి కథలో తిరకాసు
హైదరాబాద్‌ః కృషి బ్యాంకు కేసులో సిఐడి వ్యవహరిస్తున్న తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా అనేక కేసులను అసమర్ధత లేదా కావాలని దీర్ఘకాలం పాటునాన్చి ఎటూ తేల్చకుండా చేసిన ఘనత సిబిఐకి వున్నదని విమర్శలు వినవస్తున్నాయి.
కృషి చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు కేసును సిఐడి తీసుకున్న తర్వాత కూడా అనేక రోజుల పాటు కృష్ణాజిల్లాలోనే సంచరించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన్ను వ్యక్తిగతంగా ఎరిగిన అనేక మంది ఈ వార్తలను ధృవీకరించారు కూడా.అయినప్పటికీ సిఐడి అధికారులు మాత్రం ఆయన ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
తాజాగా వెంకటేశ్వరరావు బెంగుళూరులో వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.అయినప్పటికీ పోలీసులు ఆయనకోసం కర్ణాటకపోలీసుల సహకారం తీసుకునే ప్రయత్నం చేయడం లేదు. వెంకటేశ్వరరావు కుడిభుజంగా భావించే కోడె శ్రీనివాస్‌ను మరో ముఖ్య అనుచరుడు వెలగపూడి శ్రీనివాస్‌నుఅరెస్టు చేసినట్టే చేసి విచారించి వదిలివేశారు. కొసరాజు తనంతతానుగా లొంగిపోయే వరకు వేచిచూసే పద్దతిని సిఐడి అధికారులు అనుసరిస్తుండటం పట్ల వారి నిజాయితీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్పాట్‌లైట్‌ః కృషిబ్యాంక్












Click it and Unblock the Notifications