ఇది ఆటవిక రాజ్యంః నేదురుమల్లి

గుంటూరుః రాష్ట్రంలో ఆటవిక రాజ్యం సాగుతున్నదని మాజీ ముఖ్యమంత్రి నరసరావుపేట ఎం.పి. నేదురుమల్లి జనార్దన్‌
రెడ్డి విమర్శించారు. ఇటీవల ముఠాకక్షలు పడగవిప్పిన గుంటూరు జిల్లా కుంకలగుంటను సోమవారం నాడు ఆయన సందర్శించారు. స్థానిక, పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని భరించలేకే తెలుగుదేశం ప్రభుత్వం ఇలా దుర్మార్గాలకు పాల్పడుతున్నదని నేదురు మల్లి విమర్శించారు.

కుంకలగుంటలో వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన ఇరువర్గాలు వేలాది బాంబులువిసురుకున్నారు. పలు ఇళ్ళు ధ్వంసమయ్యాయి. దాదాపు గ్రామం మరుభూమిగా మారింది.

గ్రామంలో ముఠాకక్షలకు తెలుగుదేశం నేతలే కారణం అని నేదురుమల్లి అన్నారు. గుంటూరులో మారణకాండ జరగడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ ప్రోద్బలం వున్నదని ఆయన ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+