వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోలుకుంటున్న శాస్త్రవేత్తలు
హైదరాబాద్‌ః హోటల్ భోజనంతో అస్వస్థతకు గురైన 63 మంది శాస్త్రజ్ఞుల్లో 18మంది ఇంకా వివిధ ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. విషప్రయోగం జరిగిందో లేదో దర్యాప్తులో తేలాల్సివున్నదని అయితే ఆహారం కలుషితం కావడం మాత్రం వాస్తవమని ఆర్‌సిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు చెప్పారు.
ఆహారం కలుషితం కావడానికి కారణమైన హోటల్ యాజమాన్యంపై పోలీసులుకు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు. ఇదిలావుండగా కలుషితాహారం కారణంగాఅస్వస్థతకు గురైన వారంతా రక్షణశాఖకు సంబంధించిన శాస్త్రవేత్తలు కావడంతో పోలీసులు భిన్న కోణాల్లోంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆహారం కలుషితం కావడం జరిగిందా లేక కావాలనే ఎవరైనా ఫుడ్ పాయిజనింగ్‌కు పాల్పడ్డారా అన్నఅంశాన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
60మంది శాస్త్రవేత్తలు ఆస్పత్రిపాలు
శాస్త్రజ్ఞులపై విషప్రయోగం?
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!