పిసిసి నేతకు టిఆర్‌ఎస్ సవాల్
హైదరాబాద్‌ః సిద్ధిపేట అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి డిపాజిట్ దక్కితే అదే ఎక్కువని టిఆర్‌ఎస్ నేత చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణాకు టిఆర్‌ఎస్ చేటని, సిద్ధిపేటలో ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యేనని పిసిసి అధ్యక్షడు సత్యనారాయణరావు చేసిన ప్రకటనను ఆయన విమర్శించారు.
సిద్ధిపేటలో కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్ దక్కగలిగేలా చేస్తే ఎమ్‌ఎస్‌ను గొప్పనేతగా గుర్తిస్తామని చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరవు సాయ పనులకు నిధులివ్వని ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని ఆయన తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేశారు. కృష్ణాడెల్టాలో వరినాట్లకు వీరులేదని ఆందోళనతో కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణకు లేఖ రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణా రైతులకు అవసరమైన కరెంటు మాత్రం ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు. రైతులకు వెంటనే కరెంట్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణా ఫోరం ఏర్పాటు చేయాలన్ని బిజెపి నేత నరేంద్ర నిర్ణయాన్ని ఆయనస్వాగించారు. సిద్ధిపేట ఎన్నిక తర్వాత టిఆర్‌ఎస్ మరింత ముమ్మరంగా ఉద్యమాన్ని నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications