వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాంప్రాస్‌ ను మట్టికరిపించిన హెవిట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః 20 ఏళ్ళ ఆస్ట్రేలియా ఆటగాడు అమెరికన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ఫైనల్‌ లో సంచలనం సృష్టించాడు. నాలుగు సార్లు యు.ఎస్‌. ఓపెన్‌ ను అలవోకగా గెలుచుకున్నటాప్‌ సీడ్‌ ను నాలుగో సీడ్‌ హెవిట్‌ వరుస సెట్లలో ఓడించాడు. సంచలన రీతిలో అమెరికన్‌ ఓపెన్‌ ఛాంపియ్‌ షిప్‌ నుకైవసం చేసుకున్నాడు.

8.5 లక్షల డాలర్ల ప్రైజ్‌ మనీనిఅందుకున్న హెవిట్‌ మాట్లాడుతూ సాంప్రాస్‌ పైవిజయం నమ్మశక్యం కాకుండా వుందన్నాడు. అది కూడా వరుససెట్లలో 7-6, 6-1, 6-1 స్కోర్లతో సాంప్రాస్‌ వంటి ఆటగాడిని ఓడించడం అంత తేలిక కాదనేది వాస్తవం.

హెవిట్‌ సాంప్రాస్‌ ను వరుస సెట్లలో అదీ గంటా 56 నిముషాల్లో మట్టికరిపించాడు. మొదటిసెట్‌ టై బ్రేకర్‌ వరకు వచ్చినప్పటికీ అదృష్టం హెవిట్‌ నే వరించింది. ఆ తరువాత సాంప్రాస్‌ భారీ తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. తొలిసెట్‌ లో రాణించినా ఆ తరువాత హెవిట్‌ దూకుడుకు సాంప్రాస్‌ నిలవలేక పోయాడు.మిగిలిన రెండు సెట్లు కూడా హెవిట్‌ వరసగా చేజిక్కించుకొనివిజయ దుందుభి మోగించాడు.

ఆగాసీ వంటి సీనియర్‌ ఆటగాళ్ళను సైతం మట్టికరిపించి దూకుడుగాఫైనల్‌ చేరుకున్న అనుభవజ్ఞుడైన సాంప్రాస్‌ 20 ఏళ్ళ కుర్రాడి చేతిలో ఓడిపోవడం టెన్నిస్‌ పండితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X