రామాలయ నిర్మాణం ఆగదుః వి.హెచ్.పి
హైదరాబాద్‌ః బాబ్రీమసీదు - రామజన్మభూమివివాదంపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆహ్వానంఅందలేదని విశ్వహిందూ పరిషత్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఆచార్య గిరిరాజ్ కిషోర్ వెల్లడించారు. అయోధ్యవివాదాన్ని మార్చి - 2002 లోగా పరిష్కరిస్తామని వాజ్ పేయి హామీ ఇవ్వడం పట్ల గిరిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ లో ఆయనవిలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ లోగా పరిష్కారం లభించకపోతే మార్చి 12న మహాశివరాత్రి తరువాత ఏదో ఒక మంచి ముహూర్తం చూసి అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి తీరుతామని ఆయన ప్రకటించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం పై కొనసాగుతున్నవివాదానికి ప్రభుత్వం ఈ లోగా పరిష్కార మార్గం కనుగొనాలని ఆయన సూచించారు. రామజన్మభూమి, కృష్ణ జన్మభూమి, కాశీవిశ్వనాధ ఆలయాలను విశ్వహిందూ పరిషత్ కుఅప్పగించాలనే డిమాండ్ ను గిరిరాజ్ కిషోర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రామజన్మభూని కేసు అలహాబాద్ హైకోర్టువిచారణలో వున్నదని, ఇప్పటి వరకు 109 మంది సాక్షులకు గాను కేవలం 14 మంది సాక్షులను మాత్రమేవిచారించారని ఆయన అన్నారు.
కొన్ని మత సంస్థలు తీవ్రవాదాన్ని సమర్థిస్తున్నాయని ఆయన తీవ్రంగావిమర్శించారు. మిజోరం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో క్రిస్టియన్‌మిషనరీలు భారీగా డబ్బు ఖర్చు పెట్టి మత మార్పిడులను చేపడుతున్నాయని, ఈ ధోరణిని సహించేది లేదని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications