హైదరాబాద్‌కు అమెరికాలోని ఇద్దరు బందీలు
హైదరాబాద్: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడుల నేపథ్యంలో అనుమానంతోఅరెస్టు చేసిన ఇద్దరు హైదరాబాదీలను ఇక్కడికి పంపించే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ జావీద్ అజ్మత్ను, అయూబ్ అలీఖాన్‌ను అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) అధికారులు అనుమానంతోఅరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒక సీనియర్ పోలీసు అధికారితో ఎఫ్‌బిఐ అధికారులు ఈ ఇద్దరిని ఇక్కడికి పంపేవిషయాన్ని తెలియజేసినట్లు చెబుతున్నారు.
దాడులకు పాల్పడిన టెర్రరిస్టు గ్రూప్‌లతోవీరికి సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదని తేలినట్లు సమాచారం. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లు సరిగా లేకపోవడంతో అమెరికా అధికారులువీరిని అదుపులోకి తీసుకుని విచారించారు.
పాస్‌పోర్టుల్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకువీరిద్దరికి భారత్‌లో పడే శిక్షపై ఎఫ్‌బిఐ అధికారులు సమాచారం అడిగినట్లు తెలుస్తోంది. పాస్‌పోర్టులపై తప్పుడుపేర్లు, తప్పుడు జన్మతేదీలు ఇచ్చినందుకు వారిద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు నగర పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిపై ఏ విధమైన క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
అయూబ్ తన ఇంటికి గత మూడేళ్లలో 2.5 మిలియన్ రూపాయలు, అజ్మత్ ఏడాదిలో తొమ్మిది లక్షల రూపాయలు పంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.












Click it and Unblock the Notifications