బజరంగ్‌దళ్‌ నిషేధానికి డిమాండ్‌

న్యూఢిల్లీః మతోన్మాద సంస్థ అనే ఆరోపణతో స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ను నిషేధించిన ప్రభుత్వం బజరంగ్‌దళ్‌ వంటి హిందూమతోన్మాద సంస్థలను కూడా నిషేధించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సిమిపై నిషేధంలో దేశ భద్రతకన్నా రాజకీయమే ప్రధాన పాత్ర పోషించిందని కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి.

బజరంగ్‌దళ్‌ కూడా తీవ్రవాద సంస్థనే అని దానిపై కూడా నిషేధం విధించాలని వారుకోరారు. ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయనే ఆరోపణతోసిమిపై కేంద్రం నిషేధం ప్రకటించిందని అయితే ఇందులో రాజకీయం పాలే ఎక్కువగా కనిపిస్తున్నదని సిపిఎం నేతసీతారామ్‌ ఏచూరి పేర్కొన్నారు. సిమిపై నిషేధం దరిమిలా ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలను మతంతో ప్రభావితం చేయాలని బిజెపి యోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నదని ఆయన అన్నారు.సిమిపై నిషేధం సమర్ధనీయమే అయితే దేశవ్యాప్తంగా తరుచూమిలిటెంట్‌ సమావేశాలను నిర్వహించే బజరంగ్‌దళ్‌ను కూడా నిషేధించాలని ఆయనకోరారు.
బిజెపి వర్గాలు కూడా సిమిపై నిషేధం ఉత్తరప్రదేశ్‌అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓట్ల పంటపండిస్తుందనేవిశ్వాసంతో వున్నారు. హిందువుల ఓట్లపై ఈ దెబ్బతో గట్టి పట్టు లభిస్తుందని ఆ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.

అమెరికాపై టెర్రరిస్టుల దాడులను సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌రాజకీయాల్లోకి మతాన్ని జొప్పించడానికి వీలుగాసిమిపై నిషేధం ప్రకటించిందని సమాజ్‌వాది పార్టీ ఆరోపించింది. సిమి కంటే ఎక్కువ బజరంగ్‌దళ్‌ వంటి పార్టీలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయని వాటిని ముందు నిషేధించాలని ఎస్‌పి నేత అమర్‌సింగ్‌కోరారు. సిమిపై నిషేధం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దిని తాము శంకిస్తున్నామని కాంగ్రెస్‌ ప్రతినిధి జయపాల్‌రెడ్డి చెప్పారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోని తమ పార్టీ ప్రభుత్వాలు సిమిని నిషేధించాలని చాలా కాలంగా కోరుతున్న కారణంగా ఈవిషయంలో కాంగ్రెస్‌ జాగ్రత్తగా మాట్లాడుతున్నది.సిమిపై నిషేధం నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రతిపక్షాలతో చర్చించివుండాల్సిందని జైపాల్‌రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+