అత్తగారి సొమ్మంతా కట్నం కాదు
న్యూఢిల్లీః వరకట్నానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు ప్రకటించింది. వివాహిత మహిళకు పుట్టింటినుంచి వచ్చే కానుకలన్నింటినీ వరకట్నం కింద లెక్కగట్టడానికి లేదని కోర్టు స్పష్టం చేసింది.
సందర్భాన్ని బట్టి ఏది వరకట్నం కిందకు వస్తుందో నిర్ణయించాలని న్యాయమూర్తులు జస్టిస్ కెటి థామస్, జస్టిస్ ఎన్‌ఎన్ వరియవలతో కూడిన డివిజన్ బెంచిపేర్కొంది. భారతీయ శిక్షా స్మృతిలోని 304-బికి భాష్యం చెబుతూ, వరకట్నం కోసం డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేయడం వల్ల ఓ ఇల్లాలు మరణించిందని అన్ని వేళాల నిర్దారించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. వరకట్నం చెల్లింపులకు సంబంధించి ముఖ్యంగా మూడు సందర్భాలు వుంటాయని కోర్టుపేర్కొంది.
పెళ్లికి ముందు,పెళ్లి సమయంలో, పెళ్లి అయిన తర్వాత అని కోర్టుపేర్కొంది. మూడవ సందర్భానికి అంతం లేనట్టుగా మనకు కనిపిస్తుంది గానీ ఈవిషయంలో స్పష్టమైన నిర్వచనాలు వున్నాయని న్యాయమూర్తులు చెప్పారు.పెళ్లి తర్వాత అత్తగారు డిమాండ్ చేసే మొత్తంపెళ్లితో ముడివడి వున్నదయితేనే దానిని వరకట్నంగా పరిగణించాల్సివుంటుందని కోర్టుపేర్కొంది. వరకట్నం చావు విషయంలో ఈ వేధింపులే చావుకు కారణమైతే తప్ప వరకట్నం చావుగా పరిగణించడానికి లేదని కోర్టు చెప్పింది.పెళ్లి తర్వాత భారతీయ సమాజంలో పిల్లలు పుట్టినప్పుడు, పుట్టిన రోజులకు, ఇతర శుభసందర్భాల్లో కానుకలు ఇచ్చే ఆచారం వున్నదని ఈ కానుకలను వరకట్నం పరిథిలో లెక్కించరాదని కోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications