అగ్నిప్రమాదంలో 13 మంది మృతి
శ్రీనగర్‌ః జమ్ముకాశ్మీర్‌లో ఒక హోటల్లో శుక్రవారం రాత్రి జరిగన అగ్నిప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో టూరిస్టులు వున్నారు.
శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో వున్న సోపోర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో కనీసం ఎనభై మంది వున్నారని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో హోటల్ చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయి. వంటగ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ ప్రమాద కారణం అధికారికంగా వెల్లడికాలేదు.












Click it and Unblock the Notifications