ఎన్‌కౌంటర్‌లో హిజ్బ్ అగ్రనేత హతం
శ్రీనగర్: పూంచ్ జిల్లా చిరాల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో హజ్బుల్ ముజాహిదీన్ ఏరియా కమాండర్ మరణించినట్లు రక్షణ శాఖ వర్గాలు శనివారం చెప్పాయి.
తమకుఅందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు చీరాల అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలను చూసినమిలిటెంట్లు కాల్పులు జరిపారు. దాంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లోస్త్రీ వేషధారణలో వున్న దనీష్ అలియాస్ ప్రిన్స్ మరణించాడు.
ఇతర మిలిటెంట్లు తమ నాయకుడ్ని వదిలేసి పారిపోయారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకెరైఫిల్‌ను, ఒక వైర్‌లెస్ సెట్‌ను, కొన్ని డాక్యుమెంట్లను భద్రతా దళాలుస్వాధీనం చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications