హంద్రీ తీరాన కోట్ల అంత్యక్రియలు
కర్నూలు: మాజీ ముఖ్యమంత్రి కోట్లవిజయభాస్కర్ రెడ్డి అంత్యక్రియలు శనివారం హంద్రీ నదీ తీరాన పూర్తి అధికార లాంఛనాలతో జరిగాయి. కోట్లవిజయభాస్కర్ రెడ్డి కుమారడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చితికి నిప్పంటించారు. వేలాది మంది అభిమానులు కోట్లకు కన్నీటి వీడ్కోలు పలికారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ, లోక్‌సభస్పీకర్ జి.ఎం.సి. బాలయోగి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఎస్. జైపాల్ రెడ్డి, తదితరులు కోట్లవిజయభాస్కర్ రెడ్డి భౌతిక కాయంపై పూలగుచ్ఛాలు వుంచి శ్రద్ధాంజలి ఘటించారు.
విజయభాస్కర్ రెడ్డి అంత్యక్రియలు జరిగిన చోటుకు కిసాన్ ఘాట్ అనిపేరు పెట్టారు. అక్కడ ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తారు.శనివారం ఉదయం కర్నూలులోని డిసిసి కార్యాలయంలో ప్రజల సందర్శనకోసం వుంచిన కోట్ల భౌతిక కాయాన్ని వేలాది మంది అభిమానాలు, కార్యకర్తలు సందర్శించి కన్నీటితో నివాళులు అర్పించారు.
ఆ తర్వాత మధ్యాహ్నం కర్నూలు పురవీధుల గుండా కోట్ల అంతిమయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు కోట్ల అమర్‌రహే నినాదాల మధ్య ఊరేగింపుగా హంద్రీ తీరానికి కోట్ల భౌతిక కాయాన్ని తీసుకువెళ్లుతున్నారు.కోట్ల మృతితో కర్నూలు ఊరంతాకన్నీటిమయంగా మారింది.












Click it and Unblock the Notifications