లాడెన్ కోసం అడగనే లేదు
ఇస్లామాబాద్‌ః అఎn్గానిస్తాన్‌లోని తాలిబన్ నేతలతో తమ ప్రతినిధి బృందం జరిపిన చర్చలు విజయవంతమైనట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. ఒసామాబిన్ లాడెన్‌ను అప్పగించాలన్న డిమాండ్ తమ ప్రతినిధులు చేయలేదని అలాంటప్పుడు చర్చలు విఫలం కావడమన్న సమస్య ఎలా వస్తుందని పాకిస్తాన్ ప్రశ్నించింది.
చర్చల సందర్భంగా ఉభయ దేశాలు కొన్ని ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకున్నాయని
వాటిని బయటపెట్టడానికి లేదని చర్చల్లో పాల్గొన్న పాకిస్తాన్ ప్రతినిధి ముల్లా అబ్దుల్ సలామ్ జయీఫ్ చెప్పారు. ప్రస్తుతసంక్షోభాన్ని పరిష్కరించడంతో పాటు ఉభయ దేశాల సుస్థిరతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా ఆయన చెప్పారు. చర్చల ప్రధానాంశం లాడెన్ కానేకాదని ఆయన వెల్లడించారు. ఇదిలా వుండగా లాడెన్‌విషయంలో తాలిబన్లు పట్టుదలగా వున్నట్టుగా తెలిసింది.
లాడెన్‌ను ఎట్టి పరిస్థితిలోఅప్పగించేది లేదని వారు పాకిస్తాన్‌కు స్పష్టం చేసినట్టుగా దౌత్యవర్గాలు చెబుతున్నాయి. మత ధర్మం దృష్ట్యాగానీ, నైతికత దృష్ట్యా గానీ లాడెన్‌ను అమెరికాకు అప్పగించడం తాలిబన్లకు ఆమోదయోగ్యం కాదని మరో మతాధికారి మహమ్మద్ జమీల్ చెప్పారు. ఇదిలా వుండగా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం తమ ప్రతినిధి బృందం దౌత్యం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దౌత్య బృందాన్ని పంపే ముందు మాత్రం అంతర్జాతీయ వత్తడిని గుర్తించి లాడెన్‌నుఅప్పగించాల్సిందిగా తాలిబన్లకు నచ్చజెప్పేందుకే ప్రతినిధులను పంపిస్తున్నట్టుగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications