దేశం ఆఫీసు ఎదుట రైతు ఆత్మహత్య
హైదరాబాద్‌ః గుంటూరు జిల్లాకు చెందిన ఒక రైతు తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుచేసి పండించిన పంట వర్షం దెబ్బకు కొరగాకుండా పోవడంతో తన గోడును ముఖ్యమంత్రికి విన్నవించి సాయం కోరుదామని వచ్చిన ఆదయ్య అనే రైతు తన ప్రయత్నం ఫలించకపోవడంతోనిస్పృహతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.
ఆదయ్య ఎన్‌టిఆర్‌ట్రస్ట్ భవనంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ విధంగానైనాసరే కలవాలనే పంతంతో గట్టి ప్రయత్నాలు చేశారనిసెక్యురిటీ సిబ్బంది తీవ్రంగా మందలించి రోడ్డుపైకి తోసేయడంతో తీవ్రంగా నిరాశ చెందాడనిఅంటున్నారు. సాయంత్రం వరకు ఎన్‌టిఆర్ ట్రస్టు భవనం ముందే వున్న ఆదయ్య సాయంత్రం తనతో తెచ్చుకున్న పురుగుల మందును తాగినట్టుగా తెలిసింది. పోలీసులకు సమాచారంఅంది ఆస్పత్రిలో చేర్చేసరికే ఆయన మరణించాడు.












Click it and Unblock the Notifications