అక్టోబర్‌ 1న టిఆర్‌ఎస్‌ ధర్నాలు

హైదరాబాద్‌ః కరవు సహాయక కార్యక్రమాల అమల్లో తెలంగాణా ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆరోపిస్తూ దీనికి నిరసనగా అక్టోబర్‌ 1న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణా రాష్ట్ర సమితి ప్రకటించింది.

తెలంగాణా ప్రాంతానికి జిల్లాకు 500 చొప్పునట్రాన్స్‌ఫార్మర్లు కేటాయించాలని టిఆర్‌ఎస్‌ నేత చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. కృష్ణాడెల్టా ప్రయోజనం కోసం నీటి విడుదల విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి కృష్ణతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణా ప్రాంతంలోని సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు.

టిఆర్‌ఎస్‌ కార్యకర్తలపై జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్‌ జిల్లాలో పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్న ఫలితంగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను నక్సలైట్లు మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించడాన్ని చంద్రశేఖర్‌రావు తీవ్రంగా దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+