ఆయుధాలను దింపిన అమెరికావిమానం
న్యూఢిల్లీ: అమెరికా దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పించడానికి శుక్రవారం ఢిల్లీలో దిగినవిమానంలో పెద్ద యెత్తున ఆయుధాలు తెచ్చినట్లు సమాచారం. ఈవిమానంలో అమెరికా కమెండోలు వచ్చారని అంటున్నారు.అఎn్ఘానిస్థాన్‌పై యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో ఆసియాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరగవచ్చుననే అనుమానంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా తన కమెండోలను ఆయా దేశాల్లో దింపుతున్నట్లు చెబుతున్నారు.
పాలెం విమానాశ్రయంలో శుక్రవారం దిగిన విమానంలో మెరైన్లు, అదనపు హైటెక్ భద్రతా పరికరాలు వచ్చినట్లు తెలుస్తోంది. సింగపూర్ నుంచి వచ్చిన ఈవిమానం తిరిగి సింగపూర్ వెళ్లిపోయింది.
అయితే ఈ వార్తలను ప్రభుత్వం ఖండిస్తోంది. అమెరికావిమానం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే ఢిల్లీలో దిగిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ చెప్పారు.












Click it and Unblock the Notifications