మండలాధ్యక్షుని దారుణ హత్య
హైదరాబాద్‌ః వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలాధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు మేడి రాములును పీపుల్స్‌వార్ గ్రూప్ నక్సలైట్లు సోమవారం నాడు దారుణంగా హత్య చేశారు. పనిమీద బయటకు వెళ్లివస్తున్న రాములును పీపుల్స్‌వార్ గ్రూప్ నక్సల్స్ దారి కాచి కాల్చిచంపినట్టుగా పోలీసులు తెలిపారు..
రాములు వయస్సు 38 సంవత్సరాలు. రాములు హత్య జిల్లా తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. జిల్లాలో తెలుగుదేశం, బిజెపి నేతలపై నక్సలైట్లు దారుణమారణకాండకు పోలీసులు కళ్లెం వేయలేకపోతున్నారని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి.
గత పదిహేను రోజుల్లోనే నక్సలైట్లు జిల్లాలో మూడు దారుణ హత్యలకు పాల్పడ్డారు. గత నెల 13న చిట్యాల ఎంపిపి సురేందర్‌రెడ్డిని కాల్చిచంపినవిషయం విదితమే. ఈ దాడిలో మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డికూడా హతులయ్యారు. ఆ తర్వాత పదిరోజులకే పరకాలలో బిజెపి ముఖ్యనాయకుడు డాక్టర్ సౌందరయ్యను ఆయన క్లినిక్‌లోనే కాల్చిచంపారు. తాజాగా రాములును హత్య చేశారు.












Click it and Unblock the Notifications