3న సింధియా అంత్యక్రియలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా అంత్యక్రియలు ఈ నెల 3వ తేదీనగ్వాలియర్‌లో జరుగుతాయి. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సింధియా అంత్యక్రియలు జరుగుతాయని ఎఐసిసి మీడియాసెక్రటరీ టామ్ వేదక్కన్ చెప్పారు. కార్యకర్తలు అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఆయన అధికార నివాసం వద్ద వుంచారు.గ్వాలియర్‌కు తరలించడానికి ముందు ఆయన భౌతిక కాయాన్ని ఎఐసిసి కార్యాలయం వద్ద వుంచుతారు.
విమాన ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా, మరో ఏడుగురి భౌతిక కాయాలను ఆగ్రా నుంచి సోమవారం ఉదయం ప్రత్యేకవిమానంలో ఢిల్లీకి తెచ్చారు.
ప్రమాద స్థలి నుంచి మృతదేహాలను ఆగ్రాకు వాహనంలో తెచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకవిమానంలో ఢిల్లీకి తరలించారు. న్యాయ శాఖ మంత్రిఅరుణ్ జైట్లీ, ప్రధాని కార్యాలయంలోని సహాయ మంత్రివిజయ్ గోయల్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ భౌతిక కాయాలను తమ వెంట ప్రత్యేకవిమానంలో తరలించారు.
విమానాశ్రయంలో కమ్యూనికేషన్స్ మంత్రి ప్రమోద్ మహాజన్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకులుకె. నట్వర్ సింగ్, గులాం నబీ ఆజాద్ వున్నారు.












Click it and Unblock the Notifications