అఎn్గాన్ రాజుకు పాక్ మద్దతు
ఇస్లామాబాద్‌ః అఎn్గానిస్తాన్‌లో తాలిబన్ పాలకులకు రోజులు దగ్గరపడినట్టుగా కనిపిస్తున్నది. అఎn్గాన్ మాజీ రాజు జహీర్‌షా సారథ్యంలో విస్తృత సంకీర్ణ కూటమిని గద్దెనెక్కించే ప్రతిపాదనకు పాకిస్తాన్ కూడా సుముఖత వ్యక్తం చేసింది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు ప్రారంభించాల్సిందిగా కోరుతూ జహీర్‌షాకు ఒక లేఖను కూడా పాకిస్తాన్ రాసింది. ఈవిషయంలో ఇటలీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జహీర్‌షా రోమ్‌లో తలదాచుకుంటున్నారు.అఎn్గాన్ రాజకీయ భవిష్యత్తును గురించి చర్చించేందుకు దూతను పంపాల్సిందిగా కోరతూ పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ రాసిన లేఖ జహీర్‌షాకుఅందినట్టుగా ఇటలీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటివరకు తాలిబన్ ప్రభుత్వానికిపెద్దదిక్కుగా వున్న ముషారఫ్ ధోరణిలో వచ్చిన మార్పు తాలిబన్లకు రోజులు దగ్గరపడినవిషయం వెల్లడిస్తున్నాయని అంటున్నారు. అఎn్గానిస్తాన్‌కు చెందిన పాతికకుపైగా ప్రతిపక్షపార్టీలు ఇప్పటికే జహీర్‌షా సారథ్యంలో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. తాలిబన్లకు వ్యతిరేకంగాస్వదేశంలో సాగుతున్న నార్తర్న్ అలయెన్స్ యుద్ధం, బయటనుంచి అదనుదొరికితే దెబ్బతీయడానికి సిద్ధంగా వున్న అమెరికా సంసిద్ధతా వల్ల ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చురుగ్గా సాగుతున్నదని పరిశీలకులుఅంటున్నారు.












Click it and Unblock the Notifications