విమాన శకలాల కోసం గాలింపు
మాస్కోః నల్ల సముద్రంలో కూలిన రష్యన్ విమానం శకలాలు, ప్రయాణికుల మృతదేహాల కోసం పెద్దఎత్తున గాలింపు ప్రారంభించారు. విమానం కాక్‌పిట్ దొరినట్టుగా గాలింపు బృందాలు ప్రకటించాయి. బ్లాక్‌బాక్స్ దొరికితే తప్ప విమానం కూలడానికి ముందు ఏం జరిగిందో అంచనా వేయడం సాధ్యం కాదని విమానయాన నిపుణులు అంటున్నారు.
సైనికవిన్యాసాల్లో భాగంగా ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణి తాకిడికే ఈవిమానం కూలిపోయి వుంటుందని వచ్చిన వార్తలను ఉక్రెయిన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతటిఘోరమైన పొరపాటు ఏమీ జరగలేదని ఉక్రెయిన్ ప్రకటించింది.విమానం కూల్చివేతలో ఉగ్రవాదులు ప్రమేయంపై కూడా జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
విమానంలో ఇజ్రాయెల్ పౌరులు ఎక్కువ సంఖ్యలో వుండటం ఈ ఊహలకు ఆస్కారం కలిగిస్తున్నది.
విమానం కూల్చివేతపై దర్యాప్తులో పరిస్పరం సహకరించుకోవాలని ఇజ్రాయెల్, రష్యా నిర్ణయించాయి. ఈ సంఘటనపై రష్యా పర్యటనలో వున్నబ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటించారు. అమెరికాతో సహా పలు పశ్చిమదేశాలువిమానం కూలిన సంఘటనకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి సహాకారానికి రష్యాకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications