ఆంధ్రలో ఐదుఅప్పెరల్ పార్క్ లు
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఐదేళ్ళలో ఐదుఅప్పెరల్ ఎక్స్ పోర్ట్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ పార్క్ ల వల్ల కనీసం ఐదులక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో తోళ్ళ పరిశ్రమ స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు సచివాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మంత్రులు తమ్మినేనిసీతారాం, పడాల భూమన్న పాల్గొన్నారు.
మెదక్,విజయనగరం తో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఈఅప్పెరల్ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఈ పార్కులలో ప్రభుత్వం కేవలం మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఈ పార్కుల వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.












Click it and Unblock the Notifications