టోనీ బ్లెయిర్ ఢిల్లీ పర్యటన
న్యూఢిల్లీః బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ శుక్రవారం నాడు ఢిల్లీ వస్తున్నట్టుగా విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. టెర్రరిజంపై అమెరికా ఎక్కుపెట్టిన దాడికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టే సన్నాహాల్లో భాగంగా ప్రపంచ దేశాల పర్యటన చేపట్టిన బ్లెయిర్ శుక్రవారం నాడు రష్యా ప్రధాని ఫుతిన్‌ను పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్‌ను కలుసుకుంటున్నారు.
ెపాకిస్తాన్ నుంచి ఆయన నేరుగా భారత్‌కు వచ్చే అవకాశం వున్నట్టుగా చెబుతున్నారు. అధికారికంగా మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరులో కాశ్మీర్‌ను కూడా చేర్చాలన్న భారత్ డిమాండ్‌కుబ్రిటన్ గట్టిగా మద్దతునిస్తున్న నేపథ్యంలో బ్లెయిర్ ఢిల్లీ పర్యటనకువిశేష ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం వరకు ఆయన ఢిల్లీ చేరుకునే అవకాశం వున్నదని శనివారం ఉదయం ప్రధాని వాజ్‌పేయితో సమావేశమవుతారని అనధికారవర్గాలుఅంటున్నాయి.












Click it and Unblock the Notifications