ఎఫ్‌.బి.ఐ. తరహాలో భారత్‌ ఏజెన్సీ

న్యూఢిల్లీః అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ తరహాలో భారత దేశంలో ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. శుక్రవారం కొత్తఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అద్వానీ సారధ్యంలో అన్ని రాష్ట్రాల డిజిపిలతో ఓ సమావేశం జరిగింది. దేశంలో నానాటికీపెచ్చుమీరి పోతున్న తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఏర్పాటు అవసరమని అద్వానీ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ తరహా ఏజెన్సీ ఏర్పాటు వల్ల రాష్ట్రాల హక్కులు హరించుకుపోతాయని వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వున్న సంస్థలు సమర్థంగానే పనిచేస్తున్నందున కొత్త సంస్థ ఏర్పాటు అవసరం ఏమొచ్చిందని రాష్ట్రల పోలీసు అధికారులు ప్రశ్నించారు. తీవ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో సుదీర్ఘంగాచర్చించారు.

వివిధ రాష్ట్రాలలో పెగుతున్న తీవ్రవాద కార్యకలాపాలపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థ ఏర్పాటు ద్వారా కేంద్రం రాష్ట్రాల శాంతి భద్రతలఅంశాలపై తలదూర్చే ప్రమాదం వున్నదని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే అటువంటు ప్రమాదే ఏదీ వుండదని అద్వానీ హామీ ఇచ్చారు. వచ్చే నెలలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో ఈఅంశంపై తుది నిర్ణయం తీసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+