వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్ష్యాలు చూపితే లాడెన్‌ ను శిక్షిస్తాం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ఃసెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌ పై జరిపిన దాడులకు లాడెన్‌ బాధ్యుడని నిరూపించే సాక్ష్యాలు చూపితే అతడ్ని ఇస్లామిక్‌ పద్ధతుల్లోవిచారణ జరుపుతామని తాలిబన్లు ప్రకటించారు. పాకిస్తాన్‌ లో తాలిబాన్‌ రాయబారి అబ్దుల్‌ సలామ్‌ జయీఫ్‌ ఈవిషయాన్ని వెల్లడించారు. లాడెన్‌ కు న్యూయార్క్‌ పై దాడులతో సంబంధం వున్నట్లు గట్టి ఆధారాలు చూపాలి, అప్పుడే అతనిని ఇస్లామిక్‌ పద్ధతుల్లో శిక్షిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇస్లాంను, ఆఫ్ఘన్‌ జాతీయతను అవమానించే వారికి తాలిబన్లు ఏ విధంగానూ సహకరించరని ఆయన స్పష్టం చేశారు.

లాడెన్‌ కోసం వేటాడుతున్న అమెరికాసైనిక చర్య కంటే చర్చల ద్వారా ముందుకుపోవడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. రక్తానికి రక్తం పరిష్కారం కాదని ఆయన సూక్తులు వల్లించారు. న్యూయార్క్‌ పై జరిగిన దాడుల్లో లాడెన్‌ పాత్ర వున్న దని నిరూపిస్తూ 20పేజీల సాక్ష్యాలను అమెరికా గురువారం పాకిస్తాన్‌ కుఅందజేసింది. ఆ సాక్ష్యాధారాల పట్ల పాక్‌ సంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ఈ తరుణంలోసరైన సాక్ష్యాలు చూపితే లాడెన్‌ ను ముస్లిం పద్దతుల్లో శిక్షిస్తామనడం హాస్యాస్పదంగా కనిపిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X