లాడెన్ కోసం యు.ఎస్.-రష్యాసేనల వేట
ఇస్లామాబాద్‌ః ఒసామాబిన్ లాడెన్ ను అతని అనుచరులను పట్టుకొనేందుకు అమెరికా - రష్యాసేనలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ మీడియా శుక్రవారం ఈవిషయాన్ని వెల్లడించింది. తజకిస్తాన్ లో వున్న రష్యాసేనలు, అమెరికాకు చెందిన సీల్ కమెండోలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ప్రవేశించినట్లు పాకిస్తాన్ వార్తా సంస్థలు తెలిపాయి.
వారం రోజులుగా ఆఫ్ఘన్ భూభాగం నుంచి సమాచారంసేకరించిన అమెరికా - రష్యా దళాలు లాడెన్ స్థావరాన్ని కూడా గుర్తించాయని భావిస్తున్నారు. టెర్రరిస్టులను తుదముట్టించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలతో పాటు రెండు దేశాలకు చెందినస్పెషల్ కమెండోలు లాడెన్ కోసం వేట ప్రారంభించాయి. లాడెన్ తలదాచుకున్నట్లు అనుమానిస్తున్న పామిర్‌పర్వత ప్రాంతం గురించి పూర్తి అవగాహన కలిగిన కమెండోలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి.












Click it and Unblock the Notifications