దేశ భద్రతపై అత్యున్నత సమావేశం
న్యూఢిల్లీః దేశ అంతర్గత భద్రతపై వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో కేంద్ర హోం మంత్రి ఎల్‌కె అద్వానీ ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి హోం శాఖ సహాయ మంత్రులు విద్యాసాగర్‌రావు, స్వామి కూడా హాజరయ్యారు.
విెమానాశ్రయాల భద్రత, టెర్రరిస్టుల అణిచివేత, న్యూయార్క్ వంటి సంఘటనలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు తదితరఅంశాలను ఈ సమావేశం చర్చిస్తుందని తెలిసింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరగడంతో మొదటినుంచి ఉగ్రవాదుల కారణంగా వున్న ముప్పు వున్న భారత్ సహజంగానే కలవరం చెందుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత వుంది.












Click it and Unblock the Notifications