మరోసారి దాడులపై అమెరికా భయం

వాషింగ్టన్‌ః అఎn్గానిస్తాన్‌కు వ్యతిరేకంగా అమెరికా సైనిక చర్య ప్రారంభించిన ఉత్తర క్షణమే న్యూయార్క్‌లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిపినట్టుగా మరికొన్ని భీకరమైన దాడులను ఒసామాబిన్‌ లాడెన్‌ దండు అమెరికాలో జరిపే అవకాశం ఖాయంగా వున్నదని ఇంటలీజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

అమెరికాలో లేని పక్షంలో ఇతర దేశాల్లోని అమెరికా ఆస్తులపై దాడులకు లాడెన్‌ ముఠా సిద్ధంగా వున్నదని ఈ వర్గాలు అమెరికా కాంగ్రెస్‌ను గట్టిగా హెచ్చరించినట్టుగా తెలిసింది. లాడెన్‌ దాడులకు నూటికి నూరు శాతం ఛాన్స్‌ వున్నదని అమెరికన్‌ ఇంటలీజెన్స్‌ వర్గాలుఅంటున్నాయి. బ్రిటన్‌, జర్మనీ, అఎn్గానిస్తాన్‌, పాకిస్తాన్‌ నుంచి సమీకరించినవివరాల ప్రకారం ఈ నిర్ధారణకు వచ్చినట్టుగా ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఇంటలీజెన్స్‌ వర్గాల సమాచారాన్ని భయభ్రాంతులు రేకెత్తించకుండా ప్రజలకు చేరవేయడం ఎలాగనేవిషయంపై అమెరికన్‌ అధికార వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ సారి దాడుల్లోవిషవాయులు, లేదా ప్రమాదకరమైన బాక్టీరియాను ఉపయోగించే అవకాశం వున్నదని అమెరికన్‌ ఇంటలీజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికన్‌ ప్రజలు ఇప్పటికే ఈ భయాలతో బెంబేలెత్తిపోతున్నారు.సెప్టెంబర్‌ 11 న్యూయార్క్‌ దాడుల తర్వాత ఎఫ్‌బిఐఅరెస్టుచేసిన అనుమానాస్పద వ్యక్తుల్లో కొందరు ప్రమాదకరమైన రసాయనాలు, ఇతర సామాగ్రిని ట్రక్కులో తరలించడానికి లైసెన్స్‌కోసం దరఖాస్తు చేసినవిషయం కూడా ఇప్పుడు బయటకువచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+