భారత్,బ్రిటన్ ఉమ్మడిపోరు
న్యూఢిల్లీః అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరులో చేతులు కలపాలని భారత్, బ్రిటన్ నిర్ణయించాయి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై అమెరికా సారథ్యంలో సాగుతున్న పోరాటానికి ప్రపంచదేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో వున్న బ్లెయిర్ శుక్రవారం నాడు ఢిల్లీ వచ్చారు.
శనివారం ఉదయం ప్రధాని వాజ్‌పేయితో ఆయనఅరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఉమ్మడి పోరాటం అవసరమని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. 20 నిమిషాలపాటు జరిగిన చర్చల్లోఅఎn్గానిస్తాన్ ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ద్వైపాక్షిక చర్చలో కాశ్మీర్‌లో పాకిస్తాన్ దన్నుతో సాగుతున్న ఉగ్రవాదంపై మాత్రం బ్లెయిర్ నోరువిప్పలేదు. భారత వర్గాలకు ఇది తీవ్ర నిరాశ కలిగించింది.
అయితే ఆ తర్వాత జరిగినవిలేకరుల సమావేశంలో మాత్రం దీనిపై బ్లెయిర్ మాట్లాడక తప్పలేదు.అఎn్గానిస్తాన్‌లో విస్తృత స్థాయి ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పాటు అవసరంపై తాను భారత ప్రధాని వాజ్‌పేయితో చర్చించినట్టుగా చర్చల తర్వాత జరిగినవిలేకరుల సమావేశంలో బ్లెయిర్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌అసెంబ్లీలో అక్టోబర్ 1న జరిగిన టెర్రరిస్టుల దాడిని బ్లెయిర్ తీవ్రంగా ఖండించారు. టెర్రరిజంపై పోరు అన్నిస్థాయిల్లో కొనసాగుతుందని బ్లెయిర్ అన్నారు. భారత్‌కు రావడానికి ముందు బ్లెయిర్ పాకిస్తాన్, రష్యా కూడా వెళ్లి ఆయాదేశాధినేతలతో మాట్లాడారు.బ్రిటన్ ప్రధానితో చర్చల తర్వాత పాకిస్తాన్ వైఖరిలోపెనుమార్పు కనిపించింది.












Click it and Unblock the Notifications